MANASSAKSHI
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 7:27 pm Posted by : State Buearo

ఆరోగ్య కష్టాల్లో సీఎంఆర్ఎఫ్ వరం

• పేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత
• ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి

పులివెందుల  :
ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన పులివెందుల నియోజకవర్గ పరిధిలోని 17 మంది లబ్ధిదారులకు రూ,14,59,279 విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను తన నివాసంలో చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భూమిరెడ్డి మాట్లాడుతూ,పేద ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం అందించడంతో పాటు,అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తమ కష్టకాలంలో ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయానికి,నేరుగా చెక్కులను అందజేసిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి లబ్ధిదారులు,వారి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.