ఇంటింటి ప్రచారంలో బీజేపీ అభ్యర్థి బత్తల పవన్
కడప (మనస్సాక్షి): కడప నగరంలోని 9వ డివిజన్‌లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి బత్తల పవన్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా బత్తల పవన్ కుమార్ స్థానిక ప్రజలను నేరుగా కలిసి, రానున్న ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా డివిజన్‌లో నెలకొన్న పలు సమస్యలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల నిర్మణం, పారిశుధ్య నిర్వహణ వంటి మౌలిక సదుపాయాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు....