MANASSAKSHI
Newspaper Banner
Date of Publish : 12 July 2026, 8:17 am Posted by : State Buearo

ఎన్‌ఆర్‌ఐ టీడీపీ జాతీయ కార్యవర్గంలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా చెంచు వేణుగోపాల్ రెడ్డి నియామకం 

 

గాలివీడు జులై 12(కడప మనస్సాక్షి ప్రతినిధి)

తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఎన్‌ఆర్‌ఐ టీడీపీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటిస్తూ, ఉమ్మడి కడప అన్నమయ్య  జిల్లా గాలివీడు మండలం గోరాన్ చెరువు  గ్రామానికి చెందిన చెంచు వేణుగోపాల్ రెడ్డిని ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించింది.చెంచు వేణుగోపాల్ రెడ్డి ఎన్నో సంవత్సరాలుగా ఎన్‌ఆర్‌ఐ టీడీపీ తరఫున పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయడం, విదేశాల్లోని తెలుగు ప్రజలను పార్టీతో అనుసంధానం చేయడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి పార్టీ అధినాయకత్వం ఈ కీలక బాధ్యతను అప్పగించింది.ఈ సందర్భంగా చెంచు వేణుగోపాల్ రెడ్డి  మాట్లాడుతూ, “నన్ను నమ్మి, నేను చేస్తున్న సేవను గుర్తించి, ఎన్‌ఆర్‌ఐ టీడీపీ జాతీయ కార్యవర్గంలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించిన  రాష్ట్ర ముఖ్యమంతి టీడీపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు  కి, రాష్ట్ర మంత్రి  పార్టీ జాతీయ కార్యదర్శి నారా

లోకేష్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు. పార్టీ నాపై ఉంచిన ఈ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత అంకితభావంతో పనిచేస్తాను. 2029 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి నా వంతు కృషిని శక్తివంచన లేకుండా కొనసాగిస్తాను” అని తెలిపారు.ఈ సందర్భంగా తనకు ఈ అవకాశం కల్పించిన పార్టీ అధినాయకత్వానికి, తనను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ అండగా నిలిచిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. చెంచు వేణుగోపాల్ రెడ్డి నియామకంతో మండల టీడీపి నాయకులు కార్యకర్తలు సొంత గ్రామ టీడీపి శ్రేణులు తమ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.