ఎన్‌ఆర్‌ఐ టీడీపీ జాతీయ కార్యవర్గంలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా చెంచు వేణుగోపాల్ రెడ్డి నియామకం
గాలివీడు జులై 12(కడప మనస్సాక్షి ప్రతినిధి) తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఎన్‌ఆర్‌ఐ టీడీపీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటిస్తూ, ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం గోరాన్ చెరువు గ్రామానికి చెందిన చెంచు వేణుగోపాల్ రెడ్డిని ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించింది.చెంచు వేణుగోపాల్ రెడ్డి ఎన్నో సంవత్సరాలుగా ఎన్‌ఆర్‌ఐ టీడీపీ తరఫున పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయడం, విదేశాల్లోని తెలుగు ప్రజలను పార్టీతో అనుసంధానం చేయడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి పార్టీ అధినాయకత్వం ఈ కీలక...