MANASSAKSHI
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 9:52 pm Posted by : State Buearo

ఎన్‌డీపీఎస్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వస్తు సామగ్రి భద్రత కోసం జిల్లాలో చేపట్టిన భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ డా శ్రీధర్ చెరుకూరి

కడప మనస్సాక్షి జూన్ 16:

ఎన్‌డీపీఎస్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వస్తు సామగ్రి భద్రత కోసం జిల్లాలో చేపట్టిన భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి  తెలిపారు.

మంగళవారం రాష్ట్ర రాజధాని నుండి రాష్ట్ర హైకోర్టు జ్యూడిషియల్ రిజిస్ట్రార్ ఎస్. కమలాకర రెడ్డి సంబంధిత న్యాయమూర్తులతో కలిసి ఎన్‌డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) చట్టం కింద స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలు, నిషేధిత వస్తువుల భద్రత కోసం జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న శాశ్వత నిల్వ కేంద్రాల నిర్మాణ పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ కార్యక్రమానికి కడప కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి హాజరై, జిల్లాలో ఎన్‌డీపీఎస్ కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న వస్తువుల తాత్కాలిక, శాశ్వత భద్రతా ఏర్పాట్లు, అందుబాటులో ఉన్న భద్రతా సదుపాయాలు, నిర్మాణ పనుల పురోగతిపై రాష్ట్ర హైకోర్టు జ్యూడిషియల్ రిజిస్ట్రార్‌కు వివరించారు. జిల్లా ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో ఎన్‌డీపీఎస్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సామగ్రిని భద్రపరిచేందుకు ఒక భవనాన్ని ఏర్పాటు చేసేందుకు తాజాగా భూమిపూజ చేసి పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. అందులో మౌలిక సదుపాయాలు, సామగ్రి నిల్వ, భద్రతా చర్యలపై జిల్లా పోలీసు యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు.