MANASSAKSHI
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 1:36 pm Posted by : State Buearo

ఏపీలో ఏ క్షణమైనా స్థానిక ఎన్నికలు – పార్టీలు సన్నద్ధం


అమరావతి జూన్ 06 : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. పంచాయతీ,మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ నెలలోనే కీలక సంక్షేమ పథకాలను అమలు చేయనుంది. ‘తల్లికి వందనం’,’అన్నదాత సుఖీభవ’,’మత్స్యకారుల భరోసా’ పథకాలతో పాటు కొత్త పింఛన్ల మంజూరు ద్వారా ప్రజల్లో సంతృప్తి శాతం పెంచి ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం వ్యూహాత్మకంగా యోచిస్తోంది. సంక్షేమ పథకాల అమలు పూర్తయిన వెంటనే,జూలై నుంచి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక,గ్రౌండ్ లెవెల్‌లో కేడర్‌ను సన్నద్ధం చేసే పనిలో పడ్డాయి.