కడపలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
భారీ బైక్ ర్యాలీ, ప్రత్యేక పూజలు, అన్నదానానికి ఏర్పాట్లు కడప, సెప్టెంబర్ 1 మనస్సాక్షి: జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కడప నగరంలో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కడప జిల్లా జనసేన నాయకులు జి.వి. రమణ, తుంగా రమణయ్య మీడియా సమావేశంలో వేడుకల వివరాలను వెల్లడించారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు పాత బస్టాండ్ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ పేరున ప్రత్యేక పూజలు, అర్చనలు...