గెలిపిస్తే రెండు నెలల్లో అభివృద్ధి పనులు
-బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి బత్తల పవన్ కుమార్ కడప, ఆగస్టు 28: కడప నగరపాలక సంస్థ పరిధిలోని 9వ వార్డులో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి బత్తల పవన్ కుమార్ శుక్రవారం సాయంత్రం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వార్డులోని పలు కాలనీలు, వీధుల్లో పర్యటించి స్థానిక ప్రజలను కలుసుకున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు తాగునీరు, మురుగు కాలువలు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, దెబ్బతిన్న రహదారుల సమస్యలను పవన్ కుమార్...