ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
చక్రాయపేట, ఆగస్టు 15 (మనస్సాక్షి విలేకరి): 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చక్రాయపేట మండలంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. శనివారం మండలంలోని సురభి పంచాయతీ నాగలగుట్టపల్లె గ్రామీణ గ్రంథాలయంలో బిజెపి నేషనల్ కౌన్సిల్ మెంబర్ మరియు శ్రీ గండి వీరాంజనేయ స్వామి పాలకమండలి సభ్యుడైన రామచంద్రారెడ్డి పాఠశాల విద్యార్థులతో కలిసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జెండా ఎగురవేసి జండా వందనం చేసిన అనంతరం చిన్నారులకు వేడుకలకు వచ్చిన పెద్దలకు మిఠాయిలు పంచిపెట్టారు అలాగే మండలంలోని...