MANASSAKSHI
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 5:38 pm Posted by : State Buearo

జానపద చెక్క భజన కళాకారులను ప్రోత్సహించడమే లలిత కళాభిరా పించం లక్ష్యం

-లలిత కళాభిరా పించం కళా రత్న (శిల్పి) అధ్యక్షుడు డాక్టర్ గొల్లపల్లి జయన్న

కడప జిల్లా సెప్టెంబర్ 01 మనస్సాక్షి: బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో చింతపుతాయపల్లె గ్రామంలో చెక్క భజన గురువు ఓబులేసు ఆధ్వర్యంలో చెక్కభజన కార్యక్రమం నిర్వహించారు చెక్క భజన గాన కోకిల నాయన పల్లి గురువు ఓబులేసు గారి ఘనంగా సన్మానించి నగదు బహుమతి ప్రధానం చేశారు చెక్క భజన సామ్రాట్ పుల్లయ్య గారి సతీమణిని ఐవరమ్మ, సత్కరించారు జానపద కళాకారులలో ఉన్నటువంటి గానం, నృత్యాన్ని ,గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఎంతగానో ఆకర్షిస్తారని ఇలాంటి కళాలను లలిత కళాభిరా పించం సంస్థ ఎంతగానో ప్రోత్సహిస్తుందని రాయలసీమ ప్రాంతాల్లో ఎంతోమంది సీనియర్ కళాకారులు మన రాయలసీమలో ఉండడం మనం చేసుకున్న అదృష్టం అని చెక్కభజన కార్యక్రమానికి విచ్చేసినటువంటి 25 మంది చెక్కభజన గురువు లును ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గురువు గుడిమే సుదర్శన్, కందుల రవికుమార్ ,చీపాడు నరసింహులు, ఈశ్వర్ గౌడ్, ఓబిలి వెంకటసుబ్బయ్య, సావిశెట్టిపల్లి శేఖర్, గుడిసెనపల్లి బాల గురవయ్య, నాగసానిపల్లి వీర మోహన్ , చితారి ఎల్లయ్య, ముళ్లపాటి ప్రసాద్ రావు , మున్నెలి ప్రసాద్,వరికుంట్ల సాయి కృష్ణ కళాభిమానులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.