🔥 *SUPER SIX :
*( టాప్ వార్తలు… ఆరు లైన్లలో, ఆరు వార్తలు..! )*
*1. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి 18వ సమావేశం.. 18వ SIPB సమావేశంలో రూ.30,515 కోట్ల పెట్టుబడులకు ఆమోదం.*
*2. కోస్తా తీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష.. సామాజిక అడవుల పెంపకానికి తీసుకోవాల్సిన చర్యలపై, తీరప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, హరిత వలయాల విస్తరణపై చర్చ.*
*3. ‘ఏపీ మద్యం రవాణా టెండర్లలో అక్రమాల కేసు’లో, వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌ను అరెస్టు చేసిన ఈడీ అధికారులు.*
*4. రాయదుర్గం సర్వే నం.83/1లోని భూమి వేలంపై 3 వారాలపాటు స్టే విధిస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.. 3 వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు తెలంగాణ హైకోర్టు ఆదేశం.*
*5. కస్టోడియల్ మరణాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు.. కస్టోడియల్ మరణం ఘోరమైన నేరమని, నిందితులైన పోలీసులను శిక్షించడానికి ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదన్న మధ్యప్రదేశ్ హైకోర్టు.*
*6. మధ్యంతర అవగాహన ఒప్పందంపై అమెరికా, ఇరాన్ అధ్యక్షులు సంతకాలు చేయడంతో ముగిసిన ‘అమెరికా-ఇరాన్’ యుద్ధం.. 60 రోజుల్లోగా శాశ్వత పరిష్కారం కనుగొనాలని అమెరికా, ఇరాన్ నిర్ణయం.*