🔥 *SUPER SIX :కడప మనస్సాక్షి
*( టాప్ వార్తలు… 8 గంటలకు! )*
*1. సింగపూర్‌లో ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’ లీడర్‌షిప్ ప్లీనరీ-2లో ప్రసంగించిన సీఎం చంద్రబాబు.. ఏపీకి వచ్చి పరిశీలించి, పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించిన సీఎం చంద్రబాబు.*
*2. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ.. ఏపీలోని పలు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, గ్రామీణాభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులపై చర్చ.*
*3. గిరిజనుల పన్ను మినహాయింపులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఐటీ చట్టం సెక్షన్ 10(26) కింద గిరిజనులకు ప్రస్తుతమున్న పన్ను మినహాయింపు రక్షణలు కొనసాగింపు.*
*4. ‘రహేజా డెవలపర్స్’పై మరోసారి ఈడీ కొరడా.. ప్రమోటర్ నవీన్ రహేజా, కుటుంబ సభ్యులకు చెందిన రూ.503.48 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసిన ఈడీ.*
*5. ‘నీట్ రీ-ఎగ్జామ్’ సజావుగా నిర్వహించేందుకు NTA సిఫార్సుతో.. ‘టెలిగ్రామ్’ యాప్‌పై ఈ నెల 22 వరకు తాత్కాలిక ఆంక్షలు విధించిన కేంద్ర ప్రభుత్వం.*
*6. దగ్గు మందును షెడ్యూల్ ‘కె’ నుంచి తొలగించి, దగ్గు మందు కొనుగోలుకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి చేస్తూ.. 1945 నాటి ఔషధ నిబంధనల్లో మార్పులు చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ.*