నీట్ 2026 ప్రవేశ పరీక్ష నిర్వహణ కై ఏర్పాట్లు పూర్తీ. జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి
కడప మనస్సాక్షి జూన్ 16: జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న నీట్ (యూజీ)-2026 ప్రవేశ పరీక్షను పారదర్శకంగా, ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్ హాలులో "నీట్" పరీక్ష నిర్వహణపై జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి , జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ డీఆర్వో మల్లికార్జునుడు సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష...