MANASSAKSHI
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 7:37 pm Posted by : State Buearo

నెల 21న యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష..!*

*అమరావతి : ఈ నెల 21న యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష..!*

*”కడప మనస్సాక్షి న్యూస్**

*రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర నిర్వహణకు తీసుకున్న చర్యలు, ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.*

*ఈ నెల 20న ఉండవల్లి గుహల దగ్గర జరిగే యోగా కార్యక్రమంలో బాబా రాందేవ్‌తో కలిసి పాల్గొననున్న సీఎం చంద్రబాబు.*

*21వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో స్టేట్ ఈవెంట్‌ నిర్వహణ.*

*స్టేడియంలో 5 వేలు నుంచి 6 వేల మందితో యోగా కార్యక్రమం.. బాబా రాందేవ్ సహా హాజరుకానున్న సీఎం చంద్రబాబు.*

*రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే యోగాంధ్రకు వచ్చే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించిన సీఎం చంద్రబాబు.*

*ఆరోగ్యంపై అందరూ ధ్యాస పెట్టేలా…. యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న సీఎం చంద్రబాబు.*

*సంజీవని కార్యక్రమంతో అనుసంధానం ద్వారా యోగాను ఇంటింటికీ తీసుకువెళ్లాలని సీఎం చంద్రబాబు సూచన.*