MANASSAKSHI
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 9:35 pm Posted by : State Buearo

పిల్లల్లో పోషకాహార లోపాన్ని గుర్తించాలి – పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు నిపుణుల సలహాలు ముఖ్యం..

– ఆరోగ్యవంతమైన ఆహారం అందించడానికి ఆయుష్ చిల్డ్రన్ హాస్పిటల్ వారి
టమ్మీ టాట్స్(Tummy Tots) మిలెట్ కుకీస్ సెరే లవ్ మిల్క్ మిక్స్ ఉత్పత్తుల ఆవిష్కరణలో ఎంఈవో శ్రీనివాసులు

గాలివీడు జూన్ 10(కడప మనస్సాక్షి) :కొన్ని లక్షణాల ద్వారా పిల్లల్లో పోషకాహార లోపాన్ని నిపుణులు ద్వారా గుర్తించవచ్చు నని తద్వారా సమస్యను ముందే పరిష్కరించుకోవచ్చని గాలి వీడు ఎం ఈ ఓ శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం
మండల కేంద్రంలో నీ స్థానిక ఆయుష్ చిల్డ్రన్ హాస్పిటల్ ఆవరణలో జరిగిన పిల్లల్లో పోషకాహార లోపాన్ని గుర్తించాలి..పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు..పిల్లలకు ఆరోగ్యవంతమైన ఆహారం అందించడానికి పిల్లల తల్లితండ్రుల తో జరిగిన అవగాహన సదస్సు లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుష్ చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్ మహేష్ నాయక్ డాక్టర్ వినూత లు పిల్లల్లో పెరుగుతున్న పోషకాహార లోపాన్ని గుర్తించడంలో దానికి సంబంధించిన ఉత్పత్తులు ఆవిష్కరించడం స్టాల్ ను ఏర్పాటు చేయడం వారి కృషి పట్టుదల అమోఘం అన్నారు. డాక్టర్ మహేష్ నాయక్ డాక్టర్ వినూత లు మాట్లాడుతూ
ఈ రోజుల్లో చాలామందిని ఆందోళన పిల్లలో పోషకాహార వంటి సమస్యలు వేధిస్తున్నాయి. వీరిలో పిల్లలూ ఉంటున్నారు. అయితే ఈ సమస్యలకు పోషకాహార లోపం కూడా కారణముకూడా.. ప్రొటీన్లు మెదడు పనితీరును కూడా ప్రభావితం చేస్తుంటాయి. మనం తీసుకునే ఆహారంలో ఇవి లోపించినప్పుడు ఆందోళన, పిల్లలో పాలు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకిచ్చే ఆహారంలో ప్రొటీన్లు తగినంతగా
ఉండేలా జాగ్రత్తపడాలి.కొంతమంది పిల్లలు చాలా హుషారుగా ఉంటారు. ఎంతసేపైనా అలుపు లేకుండా ఆడుకుంటారు. కానీ ఆహారం దగ్గరకు వచ్చేసరికి తక్కువగా తింటుంటారు. అయితే చురుగ్గా ఉన్నారని తల్లిదండ్రులు కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ, ఇలాంటి వారిలో అరుగుదల సమస్యలు ఉండే అవకాశం ఉంది. దీనికి కారణం వారి శరీరం పోషకాలను గ్రహించలేకపోవడమే.
కొంతమంది పిల్లలు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల తరచూ ప్లూ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తుండాలి. అంతేకాకుండా శరీరానికి కావాల్సిన పోషకాలను సమపాళ్లలో తీసుకోవాలి.
సాధ్యమైనంత వరకు బయటి ఆహారానికి దూరంగా ఉండాలని, తద్వారా పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు.ఈ రోజుల్లో పిల్లలు కూడా ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి పోషకాహార లోపం కూడా ఓ కారణము.తీసుకునే ఆహారంలో సరిపడ పోషకాలు లభించనప్పుడు ఎదో ఒకటి తినాలనిపిస్తుంటుంది. తద్వారా ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటారు.దీనివల్ల పిల్లలో పలు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు..కాబట్టి, పిల్లలకు అందించే ఆహారంలో స్టూల, సూక్ష్మ పోషకాలన్నీ లభించేలా జాగ్రత్తపడాలని అన్నారు.ఎదిగే పిల్లలకు ఇది ఎంతో అవసరం కూడా. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. అనంతరం ఆయుష్ చిల్డ్రన్ హాస్పిటల్ వారి టమ్మీ టాట్స్(Tummy Tots) మిలెట్ కుకీస్ సెరే లవ్ మిల్క్ మిక్స్ ఉత్పత్తుల ప్రముఖులు రిబ్బన్ కట్ చేసి స్టాల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండలంలో నీ పలువురు ఉపాధ్యాయలు… ప్రవేట్ స్కూల్ యాజమాన్యాలు పలు మెడికల్ స్టార్ ఫార్మసిస్టులు..గ్రామ పెద్దలు  పిల్లల తల్లితండ్రులు ఆయుష్ హాస్పిటల్ సిబ్బంది తదితురులు పాల్గొన్నారు.