పులివెందుల విద్యుత్ డీఈగా నాగేంద్ర బాధ్యతల స్వీకరణ
పులివెందుల జూన్ 03 : పులివెందుల విద్యుత్ డివిజన్ నూతన డీఈగా నాగేంద్ర బుధవారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక డివిజన్ కార్యాలయంలో ఇటీవల విద్యుత్ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ డీఈగా పనిచేస్తున్న ప్రసాద్ రెడ్డి తిరుపతి కార్పొరేట్ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో వేంపల్లి పట్టణంలో ఏఈగా విధులు నిర్వహిస్తున్న నాగేంద్ర ఇటీవల ప్రమోషన్ పొంది డీఈగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతల స్వీకరణ అనంతరం డీఈ నాగేంద్ర మాట్లాడుతూ,తనకు అప్పగించిన ఈ బాధ్యతను విద్యుత్ అధికారులు, సిబ్బంది సహకారంతో...