పుస్తకాల పేరుతో వ్యాపారం చేస్తున్నా ప్రైవేట్ పాఠశాలలు

జమ్మలమడుగు జూన్8:పట్టణంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి మరి ముందస్తుగానే పుస్తకాలు కొనుక్కోవాలని ఒత్తిడి తెచ్చి డిమాండ్ చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ సహయ కార్యదర్శి హరిబాబు స్థానిక ఆర్డిఓ కార్యాలయంలోని శిరీష కు వినతి పత్రం అందజేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే పాఠ్యపుస్తకాలు కొనాలనే పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్న ప్రవేట్ పాఠశాలు.పాఠ్యపుస్తకాలను ముందే కొనుక్కోవాలని తల్లిదండ్రులకు ఫోన్ చేసి మరి ఒత్తిడి చేస్తున్నారు.అంతేకాకుండా ప్రీ ప్రైమరీ,ప్రైమరీ,యూకేజీ, నర్సరీ,పిల్లల బుక్స్ 3000 రూపాయలు నుంచి 10,000 వరకు...