ప్రజల వద్దకు పవన్.. సమస్యలకు పరిష్కార హామీ
కడప మనస్సాక్షి: నగర కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ బీజేపీ-కూటమి కార్పొరేటర్ అభ్యర్థి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బత్తల పవన్ కుమార్ (B.Tech) విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి డివిజన్‌లోని ప్రతి వీధిలో పర్యటిస్తూ 'మై విజన్ ఫర్ అవర్ డివిజన్' ఎన్నికల మ్యానిఫెస్టో కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్ సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని, గెలిచిన రెండు నెలల్లోనే సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని స్పష్టం...