తొండూరు మనస్సాక్షి : మండల పరిధిలోని ఇనగలూరు జిల్లా పరిషత్ హైస్కూల్,ఎంపీపీ పాఠశాలల ఆధ్వర్యంలో పుర వీధుల్లో ‘బడిబాట’ కార్యక్రమం గురువారం నిర్వహించారు. బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలనే లక్ష్యంతో ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పిల్లలను స్కూల్‌లో చేర్పిస్తే వచ్చే లాభాలు,ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వివరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు,విద్యార్థులు గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. ‘చదువుకోండి – ఎదగండి’,’బడికి రండి – భవిష్యత్తు నిర్మించండి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. డ్రాపౌట్స్ లేకుండా చూడాలని,ప్రతి బిడ్డకు విద్య అందాలని ఉపాధ్యాయులు కోరారు. జగనన్న అమ్మ ఒడి,విద్యా కానుక,మధ్యాహ్న భోజనం వంటి పథకాలతో ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందుతోందని తల్లిదండ్రులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ భారతి హైస్కూల్ హెచ్ఎం,విజయ భాస్కర్ రెడ్డి,ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయులు,సీఆర్పీ,అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.