బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 25 ఏళ్ల సేవా ప్రస్థానం
హైదరాబాద్, జూన్ 21: క్యాన్సర్ చికిత్సను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ప్రారంభమైన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 25 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న వారి జీవితాలు మధ్యలోనే ముగిసిపోకూడదన్న ఆలోచనతో బసవతారకం పేరుతో క్యాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో రూపుదిద్దుకుంది ఈ సంస్థ. ప్రపంచ స్థాయి క్యాన్సర్ వైద్య సేవలను తక్కువ ఖర్చుతో, లాభాపేక్ష లేకుండా అందించాలన్న లక్ష్యంతో దివంగత నందమూరి తారక రామారావు ఆధ్వర్యంలో 1988లో ఈ కార్యక్రమానికి...