MANASSAKSHI
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 10:08 am Posted by : State Buearo

మడూరు శివార్లలో పేకాట స్థావరంపై దాడి – నలుగురు అరెస్ట్

  • అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్సై ఘన మద్దిలేటి హెచ్చరిక

తొండూరు మనస్సాక్షి: విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం తొండూరు మండల పరిధిలోని మడూరు గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్న నలుగురు జూదగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.4,800 నగదు,పేకాట ముక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎస్సై ఘన మద్దిలేటి తెలిపారు. మండలంలో ఎక్కడైనా పేకాట,కోడిపందాలు,మట్కా వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రజలు కూడా తమ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు 9121100617 సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.