మదనపల్లి జూన్ 17 (కడప మనస్సాక్షి ప్రతినిధి)
– పార్టీలకు అతీతంగా ప్రజలు తరలిరావాలి
– తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ పిలుపు
ఈనెల 20వ తేదీ న అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తారని టిడిపి సీనియర్ నాయకులు ఆర్.జె.వెంకటేష్ పేర్కొన్నారు.బుధవారం నిమ్మనపల్లి కూడలిలో గల టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మదనపల్లె జిల్లా ఏర్పాటుకు హామీ ఇచ్చి,ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నాయుడు దశాబ్దాల కల అయిన మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించి ఇక్కడ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చారన్నారు.గత వైసిపి ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజనలో మదనపల్లికి చోటు కల్పించకపోవడంతో తెలుగుదేశం పార్టీతోపాటు వామపక్షాలు,ఇతర పార్టీలు మదనపల్లి జిల్లా కోసం ఉద్యమించాయని గుర్తుచేశారు.అయితే జిల్లా కేంద్రంగా మదనపల్లి ఏర్పాటైనప్పటికీ కొన్ని సమస్యలు అలాగే మిగిలిపోయాయన్నారు.ముఖ్యంగా మదనపల్లి పట్టణంలో రోడ్ల విస్తరణ,మదనపల్లి నుండి రామసముద్రం,నిమ్మనపల్లెలకు డబుల్ రోడ్డు నిర్మాణం,చారిత్రాత్మక బీటీ కళాశాలను యూనివర్సిటీగా ప్రకటించడం,మధ్యలో ఆగిపోయిన మెడికల్ కళాశాల పనులను తిరిగి ప్రారంభించడం,బహుదా ప్రాజెక్టును నీటితో నింపడం,హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం ద్వారా నియోజకవర్గంలోని అన్నిచెరువులను పూర్తిస్థాయిలో నింపడం వంటి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ద్వారా వాటిని పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యత ఎంతైనా ఉందన్నారు.అదేవిధంగా చీకలబైలు వద్ద జలధార కార్యక్రమానికి ముఖ్యమంత్రి భూమిపూజ చేస్తారని,అనంతరం అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ సభకు కూటమి నాయకులు,కార్యకర్తలు,నియోజకవర్గంలోని ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.జిల్లా కేంద్రం హామీ నెరవేర్చిన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి మదనపల్లికి విచ్చేస్తున్నారని కావున ఆయనకు కనివినీ ఎరుగని రీతిలో స్వాగతం పలకాలని పార్టీ శ్రేణులు,ప్రజలను ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు గండికోట గణేష్,శ్రీనాథ్,భరత్,విద్యా సాగర్,దేవకి తదితరులు పాల్గొన్నారు.