మున్సిపల్ సమరం.. కడపలో రాజకీయ వేడి!

పీఠం ఒక్కటి.. ఆశావహులు ఎందరో! కడప, మనస్సాక్షి: మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో ఉమ్మడి కడప జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మేయర్, మున్సిపల్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునేందుకు అధికార కూటమి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక, సామాజిక సమీకరణాలు, రిజర్వేషన్లు, అసమ్మతి నేతల బుజ్జగింపులు ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారాయి. కడప నగరపాలక సంస్థతో పాటు పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు తదితర మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ఎంపికపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది....