మైదుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ సస్పెండ్

కడప, జూన్ 17: జిల్లా అభివృద్ధిపై సమీక్షించేందుకు బుధవారం జిల్లా సచివాలయంలోని పీజీఆర్ఎస్ (PGRS) సమావేశ మందిరంలో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి శ్రీమతి సవిత అధ్యక్షతన, జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మైదుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ పి.వెంకటలక్ష్మి విధుల్లో జరిగిన కొన్ని అవకతవకల అంశాన్ని స్థానిక ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్...