రామనపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు ‘స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్’ అవార్డు
చెన్నూరు, ఆగస్టు 28 మనస్సాక్షి: హాకీ మాంత్రికుడు, భారత క్రీడా దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఏటా ఆగస్టు 29న నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేస్తున్న *‘స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్–2026’*కు వైఎస్సార్ కడప జిల్లాలోని చెన్నూరు మండలం రామనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంపికైంది. క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు పాఠశాల స్థాయిలో సాధించిన క్రీడా ప్రతిభను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలోని ఐదు పాఠశాలలను ఎంపిక చేస్తోంది. ఎస్‌జీఎఫ్‌లో పాఠశాల...