రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్‌ లక్ష్యం* *స్వచ్ఛతకు, పచ్చదనానికి ఏయూ ఆదర్శం కావాలి* *పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతన్న సీఎం చంద్రబాబు* *ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏయూలో మొక్క నాటిన సీఎం* *స్టీల్ సిటీలో సీఎం సైకిల్‌ సవారీ – ఐదున్నర కి.మీ. ప్రయాణం*

  *విశాఖపట్నం, జూన్ 5:* రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ సాధించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రోజురోజుకూ పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని... ఓవైపు విపరీతమైన ఎండలు, లేదంటే తుఫానులు వస్తున్నాయన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో శుక్రవారం ముఖ్యమంత్రి పాల్గొన్నారు. శాసన సభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు దీనికి హాజరయ్యారు....