రాష్ట్ర అభివృద్ధికి కడప జిల్లా కీలక భాగస్వామి- జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి

రాష్ట్ర అభివృద్ధికి కడప జిల్లా కీలక భాగస్వామిగా మారుతోందని, రాష్ట్రంలో అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న టాప్-10 జిల్లాల్లో నాలుగు జిల్లాలు రాయలసీమకు చెందినవే కావడం గర్వకారణమని, ప్రతి సంవత్సరం దాదాపు 10 శాతం వృద్ధి రేటుతో రాయలసీమ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు తెలిపారు. రాయలసీమ అభ్యున్నతి, పారిశ్రామిక వికాసం, పెట్టుబడుల ప్రోత్సాహం, నవకల్పనలపై సమర్థ రీసెర్చ్ & రిసర్జెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన “రైజింగ్ రాయలసీమ: ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ & ఇన్వెస్ట్‌మెంట్” సదస్సు స్థానిక జడ్పీ...