-సీఐ టీ.నరసింహులు
వేంపల్లి, ఆగష్టు 28 మనస్సాక్షి: స్థానిక పట్టణంలో ని పలు ప్రాంతాల్లో సిఐ.టి.నరసింహులు మరియు పోలీసు సిబ్బంది డ్రోన్ బీట్ నిర్వహించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ సర్కిల్ , రాజీవ్ నగర్ కాలనీ , అలవలపాడు రోడ్ , హనుమాన్ జంక్షన్ , కడప రోడ్ , పార్క్ ఏరియా గాజులపేట ఏరియా, మరియు గండి రోడ్ తదితర ప్రాంతాల్లో సీ.ఐ.టీ. నరసింహులు డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా సీఐ. టీ. నరసింహులు మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, జూదం ఆడడం, ఎవరైనా ఆ సాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడినచో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సి.ఐ.టి. నరసింహులు తెలిపారు.