శ్రీ సీతారామ సంకీర్తన క్షేత్రంలో చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు

చెన్నూరు : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేసే లక్ష్యంతో లోరిష బృంద నాట్య కళామందిరం ఆధ్వర్యంలో నిర్వహించిన నెలరోజుల కూచిపూడి సమ్మర్ క్యాంపు ఆదివారం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక శ్రీ సీతారామ సంకీర్తన క్షేత్రం ప్రాంగణంలో చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ వేషధారణలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు భారతీయ కళా వైభవాన్ని ప్రతిబింబించాయి. భక్తిరస, శృంగార, వీరరసాలతో కూడిన అభినయాలు, లయబద్ధమైన అడుగులు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ సందర్భంగా కూచిపూడి నాట్య గురువు...