గాలివీడు జూన్ 17(కడప మనస్సాక్షి ప్రతినిధి):
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలకు సంబంధించిన జెడ్పీ డిప్యూటీ సీఈఓ రామచంద్ర స్వచ్ఛ రథం, జలగారతి, యోగాంధ్ర తదితర పలు అంశాలపై సమీక్ష జరిపారు..బుధవారం గాలివీడు ఎంపిడిఓ కార్యాలయం ఆకస్మిక తనిఖీలో భాగంగా సంక్షేమ కార్యక్రమాల సమీక్ష: మండలంలో అమలవుతున్న వివిధ ప్రభుత్వ పథకాలు, స్వచ్ఛ రథం,జలహరతి మౌలిక వసతుల పనుల ప్రగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.మండలాన్ని స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజలలో అవగాహన కల్పించే కార్యక్రమాల్లో డిప్యూటీ సీఈఓ కీలక సూచనలు చేశారు. అనంతరం
యోగ సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత మరియు ఉల్లాసం పొందవచ్చని డిప్యూటీ సి ఈ ఓ రామచంద్ర తెలిపారు.అనంతరం కార్యాలయ సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘యోగాంధ్ర క్యాంపెయిన్-2026’ కార్యక్రమాన్ని మండలంలో విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేయాలని ఎంపిడిఓ,పలు శాఖల అధికారులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ దామోదర్ రెడ్డి,డిప్యూటీ ఎంపిడిఓ ఈ ఓ పీ ఆర్టి వెంకటేశ్వర్లు , జి ఎస్ డబ్ల్యూ ఎస్ డిప్యూటీ ఎంపిడిఓ
గిరి ప్రసాద్ లు కార్యాలయ ఏ ఓ జాబీర్ అహమ్మద్, ఏ ఈ రాజశేఖర్ మరియు కార్యాలయ సిబ్బంది తదితురులు పాల్గొన్నారు.