స్నేహిత అమృత హస్తం భవనానికి రూ,20 వేల విరాళం

పులివెందుల జూన్ 03 మనస్సాక్షి: పులివెందులలోని జగనన్న కాలనీ 100 అడుగుల రోడ్డులో స్నేహిత అమృత హస్తం సేవాసమితి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నూతన భవన సముదాయానికి వైఎస్సార్సీపీ లింగాల మండల కన్వీనర్ ముద్దిగారి బాబురెడ్డి రూ,20 వేల విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని వైఎస్సార్సీపీ పులివెందుల పట్టణ కన్వీనర్ గంగాధర్ రెడ్డి చేతుల మీదుగా సేవాసమితి అధ్యక్షుడు రాజుకు అందజేశారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ,విద్య,వైద్య రంగాల్లో ఉచిత కోచింగ్,నేత్ర సేకరణ,అత్యవసర సేవలతో స్నేహిత అమృత హస్తం సేవాసమితి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు....