హామీలను గాలికి వదిలేసిన చంద్రబాబు

మండల కన్వీనర్ భూమిరెడ్డి రవీంద్రారెడ్డి తొండూరు మనస్సాక్షి : ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి నిరసనగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గురువారం తొండూరు మండల పరిధిలోని ఇనగలూరు బస్టాప్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు "వెన్నుపోటుకు రెండేళ్లు" పేరుతో ఈ కార్యక్రమం చేపట్టారు. వైకాపా మండల కన్వీనర్ భూమిరెడ్డి రవీంద్రారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ మేనిఫెస్టో,సూపర్ సిక్స్ హామీలు,హామీల బాండ్లను దగ్ధం చేసి నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు...