20 ఏళ్ల తర్వాత ‘తమటం వారి దేవారెద్దు వేల్పు’
గాలివీడు మనస్సాక్షి: రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలంలోని ఎగువ గొట్టివీడు పంచాయతీ తమటం వారి పల్లెలో ఈ నెల 5, 6 తేదీలలో దేవారెద్దు వేల్పు మహోత్సవం ఘనంగా జరగనుంది. 2005 తర్వాత 20 ఏళ్లకు తిరిగి ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవానికి అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాల నుండి 11 నాణ్యాలు (దేవతామూర్తులు) తరలిరానున్నాయి. కాకినాడ, తమిళనాడు నిపుణులతో ప్రత్యేక బాణాసంచా ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం రెండు రోజుల పాటు ఉచిత అన్నదానం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు...