9వ వార్డులో బీజేపీ జోరు.. ఇంటింటా ప్రచారం
కడప (మనస్సాక్షి): కడప నగరంలోని 9వ డివిజన్‌లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి బత్తల పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం ఉత్సాహంగా సాగింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా బత్తల పవన్ కుమార్ ప్రజలకు నమస్కరిస్తూ బీజేపీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, డివిజన్...