9వ వార్డు అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం
-కార్పొరేటర్ అభ్యర్థి బత్తల పవన్ కుమార్ కడప: కడప నగరపాలక సంస్థ పరిధిలోని 9వ వార్డును అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేసి నంబర్ వన్ వార్డుగా తీర్చిదిద్దడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బత్తల పవన్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం వార్డు పరిధిలోని పలు కాలనీలు, వీధుల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి స్థానిక ప్రజలను నేరుగా కలుసుకుని, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి...