Uncategorized

అత్యంత వైభవంగా నిత్య కల్యాణ మూర్తుల బ్రహ్మోత్సవాలు ప్రారంభం

కమలాపురం: పురాతన విగ్రహ దేవతా మూర్తులు శ్రీ మహాలక్మి మోక్షనారాయణ స్వామి శ్రీ వల్లి దేవసేన సమేత ద్వికందర షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ సంజీవిని మూలిక సహిత వీరాంజనేయ స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైయస్సార్ కడప జిల్లా కమలాపురం మండలం శ్రీ రామాపురం పుణ్య క్షేత్రంలో బుధవారం ఉదయం ఘనపాటి వేద పండితులు ,పవిత్ర మంత్రోచ్ఛారణల తో బ్రహ్మోత్సవాల పూజ సేవలు ప్రారంభమయ్యాయి నేటి నుంచి మే నెల మూడవ తేదీ ఆదివారం వరకు అత్యంత వైభవంగా కనుల పండుగ గా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.హరిహరాదు లైన ఇద్దరు దేవత మూర్తులకు ఒకే వేదికపై నిత్య కళ్యాణం జరిగే రామాపురం మహా పుణ్యక్షేత్రంలో ముగ్గురు దేవత మూర్తులకు బ్రహ్మోత్సవాలు ఒకేసారి జరుగుతుండడం కూడా ఈ క్షేత్రం ప్రత్యేక విశిష్టత .ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల త్రయోదశి నుంచి బహుళ విధియ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఈ ఆలయంలో పరిపాటిగా వస్తోంది .ఆలయ ప్రధాన సేవకులు కాశీ బట్ల సత్య సాయినాథ్ శర్మ దంపతులు సాయినాథ శర్మ సోదరుడు శివరామ శర్మ కంకణ ధారణతో వేద పండితులు బ్రహ్మోత్సవాల పూజలకు శ్రీకారం చుట్టారు.ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో పేరందిన సలక్షణ ఘనపాటి వంశీకృష్ణ మధ్యప్రదేశ్ కు చెందిన వేద ఘనపాటి శివ కశ్యప్ ఇతర వేద పండితుల నిర్వహణ లో గణపతి పూజ స్వస్తివాచకము కలశ స్థాపన గోపూజ మృత్సం గ్రహణం యాగశాల ప్రవేశం మూలవిరాట్ ల ఆవాహనతో ఘనంగా పూజలు ప్రారంభించారు. సాయంత్రం మాడవీధులలో మహాలక్ష్మి మోక్ష నారాయణ స్వామిని వల్లి దేవసేన షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లను వృషభ అశ్వ వాహనాలపై ఊరేగింపు నిర్వహించారు .ఎండలు మండుతున్నప్పటికీ విశేష సంఖ్యలో భక్తులు బ్రహ్మోత్సవాలకు హాజరు కావడం ప్రత్యేక విశేషం ఆలయ ప్రధాన అర్చకులు ప్రదీప్ శర్మ బ్రహ్మోత్సవాల కార్యనిర్వాహక వేద పండితులు రామనపల్లి వెంకటేశ్వర శర్మ నెమలి అప్పాజీ స్వామి బ్రహ్మోత్సవాల పూజా సేవలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సహకారం అందిస్తున్నారు.ఆలయానికి విచ్చేసిన భక్తులకు భోజన సదుపాయాలు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు .పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ సేవకులు గుండం వెంకటేశ్వర రెడ్డి పుల్లా హరి నంద్యాల మహేష్ కల్లూరు జనార్దన్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఇందిరెడ్డి సుబ్బారెడ్డి భూపాళం సాయి షుకూర్ నామాల రమేష్ గుండాల ఆంజనేయులు,ఆది శ్రీనివాసులు తదితరులు బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల సేవకులుగా .ఈ సందర్భంగా ఆలయ ప్రధాన సేవకులు సత్య సాయినాథ్ శర్మ మాట్లాడుతూ భక్తుల పాలిట కొంగుబంగారమైన మహాలక్ష్మి మోక్ష నారాయణ స్వామి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంజీవిని మూలికా సహిత వీరాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలకు విశేష సంఖ్యలో భక్తులు రావాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *