కరెంట్ బిల్లులో పేరు మార్చుకోవచ్చు..
మొబైల్ నుంచే సులువుగా ఇలా ప్రాసెస్ పూర్తి చేయండి..
కరెంట్ బిల్లులోని పేరును మార్చుకోవడానికి విద్యుత్ సంస్థలు అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
ఆన్‌లైన్ ద్వారానే సులువుగా కరెంటు మీటర్ ఓనర్ పేరు మార్చుకోవచ్చు.
ఇందుకోసం ఆధారాలు చూపించే పలు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఆ ప్రాసెస్ ఏంటి..?
ఎలా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి?
అనే విషయాలు తెలుసుకుందాం.
కడప మనస్సాక్షి జూన్ 19
కరెంట్ బిల్లు మనకు అడ్రస్ ప్రూఫ్ కోసం ఉపయోగపడుతూ ఉంటుంది. మనం ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటికి పొందాలన్నా అడ్రస్ ధృవీకకరణ డాక్యుమెంట్‌గా విద్యుత్ బిల్లు సహాయపడుతుంది.
ఇక గుర్తింపు ధృవీకరణ పత్రాల్లో అడ్రస్ అప్డేట్ చేసుకోవాలన్నా బిల్లు ఉపయోగపడుతుంది.
మీరు ఏదైనా ఫ్లాట్ కొనుగోలు చేసి స్దిరనివాసం ఏర్పాటు చేసుకున్నా లేదా మీ కుటుంబంలోని వేరేవారి పేర్లపై కరెంట్ బిల్లు ఉన్నా మీరు అందులోని నేమ్‌ను సులువుగా మార్చుకోవచ్చు.
కేవలం ఆన్‌లైన్ ద్వారా ఇంటి వద్దనే ఛేంజ్ చేసుకోవచ్చు. చాలామందికి ఈ విషయం తెలియక పాత కనెక్షన్ రద్దు చేసి కొత్త కనెక్షన్ తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.
కానీ అలాంటి అవసరం లేకుండా కరెంట్ బిల్లును మీ పేరుపైకి మార్చుకోవచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.
ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం
-ఫ్లాట్ కొనుగోలు చేస్తే రిజిస్టర్డ్ సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్ అవసరం. అలాగే ఆధార్, పాన్ లాంటి ఏదైనా ధృవీకరణ పత్రం ఉండాలి.
ఇక రూ.100 నాన్ జ్యూడీషియల్ స్టాంప్ పేరుతో ఇండెమ్మిటీ బాండ్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఈ బాండ్ ఫార్మట్ టీజీస్పీడీసీఎల్ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంటుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకుని వివరాలన్నీ పూర్తి చేసి సమర్పించాలి.
అన్ని డాక్యుమెంట్లపై సంతకం చేయాలి. సంతకం చేశాక ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.
ఇండెమ్నిటీ బాండ్ పీడీఎఫ్ ఫార్మట్‌లో 500కేబీలోపు ఉండాలి. ఇక రిజిస్టర్డ్ సేల్ డీట్ 5 ఎంబీలోపు పీడీఎఫ్ ఫార్మట్‌లో ఉండేలా చూసుకోవాలి.
ఇక మీ గుర్తింపు ధృవీకరణ పత్రం 100కేబీలోపు జేపీజీ లేదా పీఈజీ ఫార్మట్‌లో ఉండాలి. వీటిని టీజీఎస్పీడీసీఎల్ వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేయాలి
-భార్యాభర్తల పేరుపై ఉండి ఒకరి పేరు మీద నుంచి మరోకరి పేరుపై మార్చుకోవాలంటే ఎన్‌ఓసీ అందించాల్సి ఉంటుంది. రూ.10 నాన్ జ్యూడీషియల్ బాండ్ పేపర్‌పై ఎన్‌ఓసీ ఇవ్వాలి
-ఇంటి యజమాని మరణిస్తే వారసులు డెత్ సర్టిఫికేట్ చూపించి మార్చుకోవచ్చు
ఎలా దరఖాస్తు చేయాలి..?
-టీజీఎస్పీడీసీఎల్ వెబ్ సైట్ ఓపెన్ చేయండి
-హోమ్ పేజీలో కన్జూమర్ సర్వీసెస్ ఎంకికను సెలక్ట్ చేసుకోండి
-సర్వీస్ రిక్వెస్ట్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.
కరెంట్ బిల్లుపై ఉండే యూనిక్ సర్వీస్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి
-మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ నమోదు చేయండి
-టైటిల్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి
-డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి
-విద్యుత్ శాఖ మీ వివరాలను పరిశీలించి బిల్లుపై పేరు మారుస్తుంది
-మారిన తర్వాత కరెంట్ బిల్లులో మీ పేరు ఉంటుంది
-దరఖాస్తు ఫీజు రూ.25 చెల్లించాల్సి ఉంటుంది.
