APలో 43 మంది వైద్యుల డిస్మిస్

*APలో 43 మంది వైద్యుల డిస్మిస్* *"కడప మనస్సాక్షి ప్రతినిధి** అనధికారికంగావిధులకు దూరమైన వైద్యులపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. రాష్ట్రంలో 43 మంది వైద్యులను డిస్మిస్ చేసింది. మరో 34 మంది రాజీనామా చేశారు. విధులకు హాజరు కాకపోవడంతో సంజాయిషీ నోటీసులు, అభియోగాలు నమోదు చేసినా వారి నుంచి స్పందన రాలేదని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. దీంతో విధుల నుంచి శాశ్వతంగా తప్పించినట్లు తెలిపారు.