🔥 *SUPER SIX : కడప మనస్సాక్షి🔥
*( టాప్ వార్తలు… ఆరు లైన్లలో, ఆరు వార్తలు )*
*1. ఈ నెల 21న నిర్వహించనున్న ‘యోగాంధ్ర-2026’ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ‘యోగా దినోత్సవం’ను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచన.*
*2. హనుమకొండలో ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్‌ను పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. నిరంజన్‌కు పవన్ కల్యాణ్ రూ.లక్ష ఆర్థిక సాయం, రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన నిర్మాత బండ్ల గణేష్.*
*3. భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్.. భారత యువతను ISIలోకి లాగుతూ, దేశంలోని పోలీసు అధికారులే లక్ష్యంగా ‘టార్గెట్ కిల్లింగ్స్’కు కుట్ర పన్నిన పాకిస్థాన్ ISIకి చెందిన ఐదుగురు ఉగ్రవాదుల అరెస్టు.*
*4. బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో రూ.100 కోట్లతో ‘పారిశ్రామిక పరిశోధన, సాంకేతికత, ఇన్నోవేషన్ పార్కు’ ఏర్పాటు చేయనున్న బిట్స్ పిలానీ, యాక్సిస్ బ్యాంకు.*
*5. ఏపీలోని 12 జిల్లాల్లో APTDC గుర్తించిన చోట్ల ‘బీచ్ షాక్స్’ ఏర్పాటుకు జీవో నెంబర్.362 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ఎక్సైజ్ శాఖ.. 2026 సెప్టెంబర్ 1 నుంచి 2029 ఆగస్టు వరకు ‘బీచ్ షాక్స్’ ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల.*
*6. ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి ముందు మరోసారి డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు.. ఒకవేళ, ఒప్పందంపై ఇరాన్ సంతకం పెట్టకపోతే మళ్లీ బాంబులు వేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక..!*