📄 ePaper
Friday, September 25, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఇంటింటి ప్రచారంలో బీజేపీ అభ్యర్థి బత్తల పవన్

ఇంటింటి ప్రచారంలో బీజేపీ అభ్యర్థి బత్తల పవన్

📰 Generate e-Paper Clip

కడప (మనస్సాక్షి): కడప నగరంలోని 9వ డివిజన్‌లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి బత్తల పవన్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా బత్తల పవన్ కుమార్ స్థానిక ప్రజలను నేరుగా కలిసి, రానున్న ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా డివిజన్‌లో నెలకొన్న పలు సమస్యలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల నిర్మణం, పారిశుధ్య నిర్వహణ వంటి మౌలిక సదుపాయాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ 9వ డివిజన్‌ను మోడల్ డివిజన్‌గా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ఈ ప్రచారంలో పాల్గొన్న బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. “మార్పు కోసం ఓటు.. అభివృద్ధి కోసం ఓటు.. బత్తల పవన్ కుమార్‌కు ఓటు” అనే నినాదాలతో కమలం గుర్తుపై ఓటు వేసి పవన్ కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ముఖ్య నాయకులు గౌరీ శంకర్, గంగాధర్, మహబూబ్ వల్లి, పార్టీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!