📄 ePaper
Saturday, September 26, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఉత్తరాంధ్ర జానపద కెరటం, విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు

ఉత్తరాంధ్ర జానపద కెరటం, విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు

📰 Generate e-Paper Clip

ఉత్తరాంధ్ర జానపద కెరటం, ప్రజాకవి, విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు…..
“ఏం పిల్లడో ఎల్దమొస్తవా” అంటూ ఆయన గొంతు విప్పితే.. జనం నరనరాల్లో చైతన్యం ఉప్పొంగేది. కేవలం పాటలు రాయడమే కాదు, తన గంభీరమైన కంఠంతో, గజ్జెకట్టి ఆడుతూ ప్రజలను మేల్కొలిపిన ప్రజా యుద్ధనౌక ఆయన.
ఉత్తరాంధ్ర యాసను, అక్కడి శ్రమజీవుల కష్టాలను తన పాటల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నత కళాకారుడు. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఆయన కలం నుంచి జాలువారిన అక్షరాలు, పలికిన రాగాలు ఎప్పటికీ అమరమే.
భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా.. ఆయన విడిచివెళ్లిన జానపద, విప్లవ గీతాల వారసత్వం తెలుగు నేలపై నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది…..

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!