📄 ePaper
Saturday, September 26, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్వేల్పు ఉత్సవాలు గ్రామీణ సంస్కృతి వైభవానికి నిదర్శనం...

వేల్పు ఉత్సవాలు గ్రామీణ సంస్కృతి వైభవానికి నిదర్శనం…

📰 Generate e-Paper Clip

  • వేల్పు శుభాలు అందించాలి…
  • భక్తి పారవశ్యంలో గాలివీడు మండలం ఎగువగొట్టివీడు గ్రామం తమటంవారిపల్లె లో జరిగిన ఎద్దు వేల్పు సంబరాలలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి

గాలివీడు మండలం గొట్టివీడు గ్రామ పంచాయతీ పరిధిలోని తమటంవారిపల్లెలో నిర్వహించిన సాంప్రదాయ ఎద్దు వేల్పు మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డికి గ్రామ ప్రజలు, యువకులు, నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు.రాయలసీమ జిల్లాల నలుమూలల నుంచి తరలివచ్చిన ఇలుగాల్పులు, భక్తులు, గ్రామస్తుల నడుమ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వేల్పులో ఏర్పాటు చేసిన ప్రతి నాణెం వద్దకు స్వయంగా వెళ్లిన శ్రీకాంత్ రెడ్డి దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం నిర్వాహకులు ఆయనను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, రైతు జీవన విధానానికి, పశుసంపదకు ప్రతీకగా నిలిచే వేల్పు ఉత్సవాలు గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెబుతున్నాయన్నారు. భక్తి, విశ్వాసం, సామాజిక ఐక్యత కలబోసుకున్న ఇలాంటి వేడుకలు గ్రామీణ జీవన విధానంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయని పేర్కొన్నారు.ఒకే వేదికపై ఇంత భారీ సంఖ్యలో నాణేలు సమీకరించడం నిర్వాహకుల అంకితభావానికి నిదర్శనమని అభినందించారు. గ్రామీణ సంప్రదాయాలు మన సంస్కృతికి మూలస్తంభాలని, వాటి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. భక్తి భావనతో నిర్వహించే వేల్పు ఉత్సవాలు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు జల్లా సుధర్శన్ రెడ్డి, మండల కన్వీనర్ మిట్టపల్లె యదుభూషన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల నాగభూషన్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు తమటం చిన్నరెడ్డి, మాజీ సర్పంచ్ మల్లికార్జున నాయుడు, మాజీ సర్పంచ్ లెల్లఁ ఉమాపతి రెడ్డి, మాజీ ఎంపీపీ బండి చిన్నారెడ్డి, గుమ్మా అమరనాథ రెడ్డి, బండి బశిరెడ్డి, మాజీ సర్పంచ్ చెన్నకేశవరెడ్డి,9 నాణేల ఇలగాల్పులు, మండలం లోని వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు,యువత పెద్దఎత్తునపాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!