📄 ePaper
Friday, September 25, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

చక్రాయపేట, ఆగస్టు 15 (మనస్సాక్షి విలేకరి):

80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చక్రాయపేట మండలంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. శనివారం మండలంలోని సురభి పంచాయతీ నాగలగుట్టపల్లె గ్రామీణ గ్రంథాలయంలో బిజెపి నేషనల్ కౌన్సిల్ మెంబర్ మరియు శ్రీ గండి వీరాంజనేయ స్వామి పాలకమండలి సభ్యుడైన రామచంద్రారెడ్డి పాఠశాల విద్యార్థులతో కలిసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జెండా ఎగురవేసి జండా వందనం చేసిన అనంతరం చిన్నారులకు వేడుకలకు వచ్చిన పెద్దలకు మిఠాయిలు పంచిపెట్టారు అలాగే మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో అలాగే పాఠశాలల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!