📄 ePaper
Wednesday, September 2, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కడపలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

కడపలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

భారీ బైక్ ర్యాలీ, ప్రత్యేక పూజలు, అన్నదానానికి ఏర్పాట్లు

కడప, సెప్టెంబర్‌ 1 మనస్సాక్షి: జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కడప నగరంలో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కడప జిల్లా జనసేన నాయకులు జి.వి. రమణ, తుంగా రమణయ్య మీడియా సమావేశంలో వేడుకల వివరాలను వెల్లడించారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు పాత బస్టాండ్ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ పేరున ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు మున్సిపల్ గ్రౌండ్‌లోని ఐఎంఏ హాల్ సందు వద్ద నుంచి వందలాది మంది జనసైనికులతో భారీ బైక్ ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ ర్యాలీ అప్సరా సర్కిల్, వై జంక్షన్, కొత్త బస్టాండ్, నాగరాజుపేట, పాత బస్టాండ్, సెవెన్ రోడ్స్, గోకుల్ లాడ్జ్, కృష్ణ సర్కిల్, అన్నమయ్య సర్కిల్ మీదుగా తిరిగి ఐఎంఏ హాల్ సందుకు చేరుకుంటుంది. ర్యాలీ అనంతరం భారీ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. జనసేన యువజన విభాగం ఆవిష్కరణ సందర్భంగా పవన్ కళ్యాణ్ సందేశాన్ని వీక్షించేందుకు భారీ తెరలను ఏర్పాటు చేయనున్నారు. కార్యక్రమానికి హాజరయ్యే జనసైనికులు, వీరమహిళలు, అభిమానులందరికీ భోజన సదుపాయం కల్పించనున్నట్లు నాయకులు తెలిపారు. కడప నగరంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు, యువత, వీరమహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!