-బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుష్మ
వేంపల్లి,ఆగష్టు 28 మనస్సాక్షి: భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి లో పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రాఖీ పౌర్ణమి పండుగ జరుపుకోవడం జరిగింది. ఈ సందర్బంగా మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుష్మ మాట్లాడుతూ సమాజంలో ప్రజలందరూ ఆరోగ్యంగ, సురక్షితంగా వున్నారంటే అందులో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర మరువలేనిదని , అలాగే మన ఇళ్ళులు , ఆసుపత్రులు, రోడ్లు , పాఠశాలలు ఇవ్వన్నీ శుభ్రంగా వున్నాయంటే అదంతా కార్మికుల చలువే అని తెలిపారు. ఈ సందర్బంగా పంచాయితీలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులైన అన్నలకు , తమ్ముళ్లకు , అక్క చెల్లెళ్లకు భారతీయ జనతా పార్టీ నాయకులు రాఖీలు కట్టి వారితో కలిసి రాఖీ పౌర్ణమి పండుగ చేసుకుని పారిశుద్ధ్య కార్మికులతో మనకి కార్మికులు రక్ష , మనం కార్మికులకు రక్ష , మనందరం దేశానికి రక్ష అని తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కడప జిల్లా వాణిజ్య సెల్ అధ్యక్షులు దొంతు సుమన్, వృషభాచలేశ్వర ఆలయ కమిటీ సభ్యుడు సునీల్ కుమార్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, ఐ.టి సెల్ కన్వీనర్ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
