గాలివీడు, ఆగస్టు 15(కడప మనస్సాక్షి ప్రతినిధి)
గాలివీడులోని రవి చంద్ర CBSE పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి పిల్లి నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పిల్లి నాగరాజు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని, విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణతో విద్యలో రాణించి దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు.
అనంతరం విద్యార్థులు నిర్వహించిన దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం షింటో ఇమ్మానెయిల్,సైజు థామస్, ప్రిన్సిపాల్ లీజా జాయ్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
