మండల కన్వీనర్ భూమిరెడ్డి రవీంద్రారెడ్డి
తొండూరు మనస్సాక్షి : ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి నిరసనగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గురువారం తొండూరు మండల పరిధిలోని ఇనగలూరు బస్టాప్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో ఈ కార్యక్రమం చేపట్టారు. వైకాపా మండల కన్వీనర్ భూమిరెడ్డి రవీంద్రారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ మేనిఫెస్టో,సూపర్ సిక్స్ హామీలు,హామీల బాండ్లను దగ్ధం చేసి నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా మెగా డీఎస్సీ,యువతకు ఉద్యోగాలు,మహిళలకు ఇచ్చిన హామీలు,రైతులకు చేసిన వాగ్దానాలు అమలు కాలేదని ఆయన ప్రశ్నించారు. “ప్రజల నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం వమ్ము చేసింది. ఇచ్చిన హామీలను గాలికొదిలేసింది. ఇదే వెన్నుపోటు” అని భూమిరెడ్డి రవీంద్రారెడ్డి మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు,అనుబంధ విభాగాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
