📄 ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్స్నేహిత అమృత హస్తం భవనానికి రూ,20 వేల విరాళం

స్నేహిత అమృత హస్తం భవనానికి రూ,20 వేల విరాళం

📰 Generate e-Paper Clip

పులివెందుల జూన్ 03 మనస్సాక్షి: పులివెందులలోని జగనన్న కాలనీ 100 అడుగుల రోడ్డులో స్నేహిత అమృత హస్తం సేవాసమితి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నూతన భవన సముదాయానికి వైఎస్సార్సీపీ లింగాల మండల కన్వీనర్ ముద్దిగారి బాబురెడ్డి రూ,20 వేల విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని వైఎస్సార్సీపీ పులివెందుల పట్టణ కన్వీనర్ గంగాధర్ రెడ్డి చేతుల మీదుగా సేవాసమితి అధ్యక్షుడు రాజుకు అందజేశారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ,విద్య,వైద్య రంగాల్లో ఉచిత కోచింగ్,నేత్ర సేకరణ,అత్యవసర సేవలతో స్నేహిత అమృత హస్తం సేవాసమితి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ఈ నూతన భవనం పూర్తయితే మరింత విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం కలుగుతుందని,సేవా భావం కలిగిన ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. సేవాసమితి అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ,భవన నిర్మాణానికి సహకరిస్తున్న దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సమాజ హితం కోసం నిర్మిస్తున్న ఈ భవనానికి ప్రజల సహకారం అవసరమని,అందరి ఆశీస్సులతో నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఈ భవనం శాశ్వత సేవా కేంద్రంగా నిలుస్తుందని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!