📄 ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కర్ణాటక నూతన ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కి శుభాకాంక్షలు

కర్ణాటక నూతన ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కి శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

-అన్నమయ్య డిసిసి అధికార ప్రతినిధి
ఆడిటర్ మన్సూర్ అలీ ఖాన్

రాయచోటి, జూన్ 3 మనస్సాక్షి: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్ కి అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి ఆడిటర్ మన్సూర్ అలీ ఖాన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బుధవారం తమ పార్టీ కార్యాలయం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్ర నూతన సీఎం డీకే శివకుమార్ నాయకత్వంలో కర్ణాటక రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది, ప్రగతి పథంలో దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మన్సూర్ అలీ ఖాన్ చెప్పారు. కర్ణాటక సీఎం చేపట్టిన కొత్త బాధ్యతలు విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షిస్తూ.. ప్రజల ఆశయాలను నెరవేర్చడంలో కర్ణాటక ముఖ్యమంత్రికి మంచి జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!