ప్రొద్దుటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ప్రొద్దుటూరులో జరగనున్న తెలుగుదేశం పార్టీ (TDP) కార్యకర్తల సమావేశానికి విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. మంత్రి లోకేష్ రాకను పురస్కరించుకుని పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సోములవారిపల్లి పంచాయితీ, ఈశ్వర్‌రెడ్డి నగర్‌కు చెందిన ప్రముఖ టీడీపీ నాయకులు పొన్నపురెడ్డి నాగిరెడ్డి, భీమచెర్ల రామచంద్రారెడ్డి తదితరులు మంత్రి నారా లోకేష్‌కు స్వాగతం పలుకుతూ ప్రత్యేక పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యకర్తల సమావేశం ద్వారా రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దిశా నిర్దేశం చేయనున్నట్లు స్థానిక నేతలు తెలిపారు. మంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
ప్రొద్దుటూరులో టీడీపీ శ్రేణుల కోలాహలం: మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం
RELATED ARTICLES
